Monday, May 6, 2024

బీజేపీ నాయకులు యువతను రెచ్చగొట్టొద్దు : మంత్రి గంగుల‌

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ యువతను రెచ్చగొట్టొద్దని, సున్నితమైన అంశాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని రాష్ట్ర బీసీ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పల్లె ప్రగతి ముగింపు సందర్భంగా చింతకుంట గ్రామంలో క్రీడా ప్రాంగణాన్ని శనివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ జరిగిన ఘటన టీఆర్ఎస్ నాయకులు చేపించారని అంటున్న బండి సంజయ్.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా టీఆర్ఎస్ వాళ్లే చేపించారా అని ప్రశ్నించారు. సున్నితమైన అంశాలపై ఆచితూచి మాట్లాడి సమస్యను పరిష్కారం చేయాలి తప్ప వివాదం చేయొద్దని, మూర్ఖపు మాటలు మాట్లాడొద్దని అన్నారు. చనిపోయిన చనిపోయిన రాకేష్ కుటుంభానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒక్కరికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న యువత పై లాఠీఛార్జ్ చేసి తుపాకులతో కాల్చడం దేశంలో మోడీ పాలన ఎలా ఉందో అర్థం అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో గత సంవత్సరం 2021 మార్చి 5న అఖిల్ పేట లో ఆర్మీ ర్యాలీ నిర్వహించి 15 నెలలు గడుస్తున్నా వారికి ఆర్మీ రాతపూర్వక పరీక్ష నిర్వహించకపోవడం వల్ల యువత నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రజాస్వామిక వాదులు మేధావులు అగ్నిపథ్ ను రద్దు చేయాలని ఖండించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అద్యక్షుడు యు శ్రీనివాస్, జిల్లా ఉప అధ్యక్షుడు గిట్ల ముకుంద రెడ్డి,నాయకులు అవుల రాజయ్య,చుక్క కుమార్, పోగుల సంపత్,రవి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement