Monday, May 6, 2024

బ‌తుక‌మ్మ పండుగ‌ను ఘ‌నంగా జ‌రుపుకోవాలి : మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌

బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాల‌నే రూ.2 కోట్లతో 20 చోట్ల బతుకమ్మ నిమజ్జనం పాయింట్లు ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ అన్నారు. 11వ డివిజన్ గౌతమీ నగర్ కాలనీలో మానేరు డ్యామ్ కట్ట వద్ద నూతనంగా నిర్మించిన బతుకమ్మ ఘాట్ మెట్లు, రైలింగ్ నుబీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. తెలంగాణ‌లో పూల‌ను పూజించే పండుగ బ‌తుక‌మ్మ అన్నారు. నూతనంగా ఐదు లక్షలతో బతుకమ్మ ఘాట్ నిర్మాణం చేసి అందుబాటులోకి తెచ్చామ‌న్నారు. తెలంగాణలో అన్ని మతాల పండుగలు సంతోషంగా జరుపుకోవాల‌న్నారు. తెలంగాణ ప్రభుత్వం -మున్సిపల్ సమన్వయంతో ఘనంగా ఏర్పాట్లు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ , లైటింగ్ ,ప్రమాదాల నివారణకు గజ ఈత గాళ్లను ఏర్పాటు చేశామ‌న్నారు. మంత్రి గుంగుల‌ తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా-నర్సయ్య, టీఆర్ఎస్ నాయకులు చల్ల హరి శంకర్, ఎడ్ల అశోక్ , కోల సంపత్ , డివిజన్ వాసులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement