Tuesday, May 7, 2024

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ

ముత్తారం: ముత్తారం మండలంలోని లక్కారం గ్రామానికి చెందిన లబ్దిదారులకు మాజీ ఎంపీపీ, రైతుబంధు సమితి అధ్యక్షులు అత్తె చంద్రమౌళి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. పెద్దపల్లి జడ్‌పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ ఆదేశాల మేరకు లబ్దిదారులు శనిగారపు దివ్య భారతికి 15 వేలు, దామెరకొండ శంకరమ్మకు 12500రూ.లు, ముత్తె శ్రీనివాస్‌కు 7వేల రూపాయలు ప్రభుత్వం ద్వారా మంజూరైన సీఎంఆర్‌ఎప్‌ చెక్కులను పంపిణీ చేశారు.కార్యక్రమంలో గ్రామ తెరాస అధ్యక్షుడు మాదాసి రమేష్‌, గ్రామస్తులు అగ్గిమల్ల కొమురయ్య, లింగయ్య, బాపు, నారాయణతోపాటు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement