Sunday, April 28, 2024

దళిత బంధు యూనిట్లను వేగవంతంగా గ్రౌండింగ్ చేయండి: కలెక్టర్

హుజూరాబాద్ నియోజకవర్గంలో లబ్ధిదారులకు దళిత బంధు యూనిట్లను వేగవంతంగా గ్రౌండింగ్ చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ఆదేశించారు. పాడి పరిశ్రమ యూనిట్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. శుక్రవారం దళిత బంధు యూనిట్ల గ్రౌండింగ్ కమిటీ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హుజూరాబాద్ నియోజకవర్గంలో లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న పాడిపరిశ్రమ యూనిట్లకు గ్రామాల వారిగా పాడి గేదెల కొనుగోలుకు కరీంనగర్ డైరీ, విజయ డైరీ ప్రతినిధులు లబ్ధిదారులను ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు , కర్ణాటక రాష్ట్రాలకు తీసుకువెళ్లి పాడి గేదెలను కొనుగోలు చేయాలని కలెక్టర్ సూచించారు. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న ఇతర లాభసాటి యూనిట్లను సెంట్రింగ్, ఫర్టిలైజర్, మెడికల్ షాప్, మినీ సూపర్ మార్కెట్ లకు సంబంధించి ఎస్ బి ఐ ఆర్ సేతి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సమగ్ర శిక్షణ ఇప్పించాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ ను ఆదేశించారు.

మంజూరైన యూనిట్లను లబ్ధిదారులు సొంతంగా నిర్వహించుకోవాలని ఇతరులకు అమ్ముతే, యూనిట్లు రద్దు చేస్తామని తెలిపారు. ఇదివరకే లబ్ధిదారులకు గ్రౌండింగ్ చేసిన జెసిబి, హార్వెస్టర్ లు, డీసీఎం వాహనాలకు వెంటనే రిజిస్ట్రేషన్లు చేయాలని మోటార్ వెహికల్ అధికారిని ఆదేశించారు. దళిత బందు యూనిట్లు గ్రౌండింగ్ చేసే సమయంలో లబ్ధిదారులను  ఇబ్బంది పెట్టవద్దని, యూనిట్లు మంజూరు చేస్తామని ఎవరైనా లబ్ధిదారులను డబ్బులు డిమాండ్ చేసిన అధికారులపై క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement