Saturday, April 27, 2024

పరిగెత్తిన కేఏపాల్.. అన్ని పోలింగ్ బూత్ లను కవర్ చేయాలట

నేడు మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. కాగా కేఏపాల్ తన కారులో ప్రతి పోలింగ్‌ బూత్‌ను విజిట్‌ చేస్తున్నారు. అయితే అందరిలా ఉంటే ఆయన పాల్‌ కాడు కదా… అందుకే పోలింగ్‌ బూత్‌ల వద్ద పరుగులు పెడుతున్నారు. ఎవరో తరుముతున్నట్లు ఒకటే పరుగు. అది చూసి ఓటేయడానికి వచ్చిన జనం ఒకటే నవ్వులు. ఎందుకలా పరుగెడుతున్నారని మీడియా అడిగితే… టైం లేదు.. అన్ని పోలింగ్‌ బూతులను కవర్‌ చేయాలి కదా. అందుకే సాయంత్రం వరకు ఇలా పరుగెడుతూనే ఉంటా.. అంటున్నారు. పాల్‌ పరుగులు తీస్తున్న వీడియోలు మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement