Wednesday, May 1, 2024

జ‌ర్న‌లిస్ట్ బ‌స్ పాస్ ల కాల ప‌రిమితి మ‌రో 3నెల‌లు పొడిగింపు

2022 సంవ‌త్స‌రానికి గానూ జ‌ర్న‌లిస్ట్ బ‌స్ పాస్ ల‌ను జారీచేయు సాఫ్ట్ వేర్ లో అవ‌స‌ర‌మైన మార్పుల‌ను చేసి ఈనెల 31 వ‌ర‌కు చెల్లుబాటులో ఉన్న జ‌ర్న‌లిస్ట్ పాస్ ల కాల వ్య‌వ‌ధిని మ‌రో మూడు నెల‌ల వ‌ర‌కు పొడిగించింది. 31.03.2022వ‌ర‌కు చెల్లుబాటు అయ్యే విధంగా పున‌రుద్ద‌రించ‌డం జ‌రిగింద‌ని టీఎస్ ఆర్టీసీ ఛైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్, మేనేజింగ్ డైరెక్ట‌ర్ వీసీ స‌జ్జ‌నార్ (ఐపీఎస్) లు తెలిపారు. రీజియన్ లోని ప‌త్రికా ప్ర‌తినిధులు జ‌ర్న‌లిస్ట్ పాస్ లు పొందేందుకు సంబంధిత ఏదైనా బ‌స్ పాస్ సెంట‌ర్ నుండి, జంట న‌గ‌రాల‌కు సంబంధించిన ప‌త్రికా ప్ర‌తినిధులు గ్రేట‌ర్ హైద‌రాబాద్ జోన్ లో ఏదైనా సెంట‌ర్ నుండి జ‌ర్న‌లిస్ట్ బ‌స్ పాస్ పొంద‌వ‌చ్చ‌న్నారు. ప్ర‌స్తుతం క‌లిగి ఉన్న అక్రిడిష‌న్ కార్డును చూపించి 31.12.2021 వ‌ర‌కు గ‌డువు తేదీ ఉన్న ప్ర‌స్తుత గుర్తింపు కార్డును బ‌స్ పాస్ కౌంట‌ర్ ఆప‌రేట‌ర్ కు అంద‌జేయాల‌న్నారు. అవ‌స‌ర‌మైన స‌ర్వీస్ ఛార్జీని చెల్లించి 31.03.2022 వ‌ర‌కు చెల్లుబాటులో ఉండే కొత్త గుర్తింపు కార్డును పొంద‌వ‌చ్చ‌న్నారు. ఏవైనా సందేహాలు, అసౌక‌ర్యాలు క‌లిగితే ప‌త్రికా ప్ర‌తినిధులు 9959226390 నెంబ‌ర్ ను, జిల్లా ప‌రిధిలోని ప‌త్రికా ప్ర‌తినిధులు సంబంధిత రీజియ‌న్ లోని ప‌ర్స‌న‌ల్ ఆఫీస‌ర్ ను సంప్ర‌దించాల‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement