Monday, April 29, 2024

గోవాలో పార్టీనా – ఈ నిబంధ‌న‌లు తెలుసుకోవాల్సిందే

క‌రోనా మ‌హ‌మ్మారితో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా బాగా పెరుగుతున్నాయి. అంద‌రికి వేకేష‌న్ అంటే గుర్తొచ్చేది గోవా. ఇక్క‌డికి కాలాల‌తో ప‌ని లేకుండా ఎంజాయ్ చేసేందుకు త‌ర‌లివెళ్తుంటారు. కాగా గోవాలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అందుకే ప‌లు ఆంక్ష‌లు విధించింది అక్క‌డి ప్ర‌భుత్వం. ఈ మేర‌కు సీఎం ప్ర‌మోద్ సావంత్ మీడియాతో మాట్లాడారు. గోవాలో పార్టీలు నిర్వ‌హించాల‌నుకునే వారు రెండు డోసుల వ్యాక్సిన్ స‌ర్టిఫికెట్ క‌లిగి ఉండాల‌న్నారు. కోవిడ్ నెగిటివ్ స‌ర్టిఫికెట్ ని తీసుకుని రావాల‌ని తెలిపారు.

అలా చేస్తేనే పార్టీల‌కు, ఈవెంట్ ల‌కు అనుమ‌తి ఇస్తామ‌న్నారు. లేనిప‌క్షంలో వాటిని ర‌ద్దు చేస్తామ‌ని చెప్పారు. ఈ కొత్త నిబంధ‌న‌లు అమ‌లుకు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల ఉత్త‌ర్వుల‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తామ‌న్నారు. సాయంత్రం వ‌ర‌కు గోవాలో క‌రోనా కేసులు 300 మార్కును దాటాయి. దీంతో నైట్ కర్ఫ్యూ లేదా ఇంకా ఇత‌ర ఆంక్ష‌లు విధిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ సీఎం ప్ర‌మోద్ సావంత్ అలాంటి నిర్ణ‌య‌మేమీ తీసుకోలేదు. త‌మ ప్ర‌భుత్వం ప‌ర్యాటక‌ రంగం పొందే ఆదాయానికి ఆటంకం కలిగే నిర్ణయం తీసుకోదని వివ‌రించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement