Tuesday, April 30, 2024

Join – కనక పూర్ సర్పంచ్ బిజెపిలో చేరిక

లక్ష్మణ చందా… ప్రభ న్యూస్ నిర్మల్ జిల్ల లక్ష్మణ చందా మండలంలోని కనకాపూర్ గ్రామ సర్పంచ్ సుక్కు రజవ్వ ముతన్న బిజెపి అభ్యర్థి ఏల్లేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి పార్టీ కండువా కప్పుకున్నారు. ఆదివారం మహేశ్వర్ రెడ్డి నివాసంలో తన అనుచరులతో కలిసి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు .అలాగే మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు యూత్ సభ్యులు ఎంపీపీ అద్వల పద్మా రమేష్ ఆధ్వర్యంలోదాదాపు 200 మంది కార్యక్తలు బీజేపీ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. వారికి మహేశ్వర్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు భూపాల్ రెడ్డి సరికెల గంగన్న ముత్యం రెడ్డి అద్వాలా రమేశ్ గాండ్ల చిన్నయ్య వేణు గౌడ్ లక్ష్మణ్ నర్సారెడ్డి అట్లా రాంరెడ్డిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement