Tuesday, May 7, 2024

గజ్వేల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎ. జాన్ రెడ్డి

గజ్వేల్,జూలై25(ప్రభ న్యూస్) – నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని రుద్రూర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ సిఐ జాన్ రెడ్డి అక్కడ నుండి గజ్వేల్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. మంగళవారం నాడు గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో ఆయ‌న‌ పట్టణ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు.

అనంతరం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ లో పోలీస్ కమిషనర్ ఎన్ .శ్వేత ను మర్యాద పూర్వకంగా కలసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా పొలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఇన్స్పెక్టర్ ను అభినందించి గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి శాంతి భద్రతలకు భంగం కలగకుండా విధులు నిర్వహించాలని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement