Saturday, April 27, 2024

Breaking: సైబ‌ర్ వ‌ల‌లో చిక్కిన జీవితా రాజ‌శేఖ‌ర్‌.. ల‌క్ష‌న్న‌ర‌ కొట్టేసిన కేటుగాళ్లు

టాలీవుడ్ ఫేమ‌స్ లేడీ జీవిత‌-రాజ‌శేఖ‌ర్ సైబ‌ర్ వ‌ల‌కు చిక్కారు. త‌క్కువ ధ‌రకే జీయో ప‌రికరాల‌ను అందిస్తామ‌ని చెప్పి కేటుగాళ్లు ఆమెకు వ‌ల విసిరారు. పెద్ద‌మొత్తం త‌గ్గింపుతో భారీ ఆఫ‌ర్ వ‌స్తుంద‌ని ఆశ‌ప‌డ్డా జీవితా వారి వ‌ల‌కు చిక్కి దాదాపు ల‌క్ష‌న్న‌ర రూపాయ‌ల‌ను పోగొట్టుకున్న‌ట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి సైబ‌ర్ క్రైమ్స్ పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌గా కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈక్ర‌మంలో చెన్నైకి చెందిన నిందితుడు న‌రేశ్ ను అరెస్టు చేసిన‌ట్టు తెలుస్తోంది. కాగా, ఇంత‌కుముందు కూడా న‌రేశ్ అనే వ్య‌క్తం చాలా మంది డైరెక్ట‌ర్ల‌ను ఇదే త‌ర‌హాలో మోసం చేసిన‌ట్టు పోలీసులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement