Saturday, April 20, 2024

ఆంధ్రప్రదేశ్​ సీఎస్​ రేసులో కొత్త పేరు.. గిరిధర్ అరమణేకు చాన్స్​ ఉంటుందా?

కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమణే ఇవ్వాల (శనివారం) తాడేపల్లిలో ఏపీ సీఎం జగన్ ను కలిశారు. రక్షణ శాఖకు చెందిన పలు ప్రాజెక్టులపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. రక్షణ రంగ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. కాగా, ఈ భేటీ నేపథ్యంలో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఏపీ సీఎస్ రేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన గిరిధర్ అరమణే కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

కొత్త సీఎస్ కోసం ఏపీ సర్కారు కసరత్తులు చేస్తున్న సమయంలోనే గిరిధర్ అరమణే సీఎం జగన్ ను కలవడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. అటు, రక్షణ శాఖ నుంచి అరమణేను రిలీవ్ చేయాలని ఏపీ సర్కారు కేంద్రానికి లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఏపీ సీఎస్ సమీర్ శర్మ పదవీకాలం నవంబరు 30తో ముగియనుంది. అయితే, నూతన సీఎస్ గా జవహర్ రెడ్డి దాదాపు ఖాయమని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, సీఎం జగన్ తో నేడు గిరిధర్ అరమణే భేటీతో సీఎస్ రేసు ఆసక్తికరంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement