Tuesday, May 14, 2024

Janasena – తెలంగాణాలో జనసేన పోటీ చేసే స్థానాలు ఇవే…

తెలంగాణలో బీజేపీ – జనసేన పొత్తు దాదాపు ఖరారైంది. జనసేనకు 8 లేదా 9 సీట్లు ఇచ్చే అంశమై బీజేపీ పరిశీలిస్తోంది. ఖమ్మంలో జనసేనకు 4 సీట్లు కేటాయించే అవ‌కాశం ఉంది. హైదరాబాద్ లో రెండు సీట్లు కేటాయించే ఛాన్స్ ఉంది. కూకట్ పల్లి, తాండూర్, ఖమ్మం, వైరా, అశ్వారావుపేట, కొత్తగూడెం, కోదాడ, నాగర్ కర్నూల్ కేటాయించే ఛాన్స్ ఉంది. ఇక, టీడీపీ, వైఎస్సాఆర్టీపీ పోటీ నుంచి తప్పుకోవడంతో సెటిలర్ల ఓటు బ్యాంకు తమకు అనుకూలిస్తుందని జనసేన భావిస్తోంది. అయితే బీజేపీ ఆశావహులు మాత్రం పొత్తులో భాగంగా జనసేనకు సీట్లు కేటాయిస్తే తమ పరిస్థితి ఏంటని ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో సీట్ల సర్ధుబాటు అంశంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జ‌న‌సేన‌తో సీట్ల స‌ర్దుబాటు త‌మ సీట్ల‌కు ఎస‌రు వ‌స్తున్న‌ద‌ని ప‌లువురు వాపోతున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement