Wednesday, May 1, 2024

Nomination Forms – కోనాయిపల్లి వెంకటేశ్వర ఆలయంలో కెసిఆర్ నామినేష‌న్ ప‌త్రాల‌తో ప్ర‌త్యేక పూజ‌లు

సిధ్దిపేట : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోనాయిపల్లి వెంకటేశ్వర ఆలయానికి చేరుకున్నారు. అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నామినేషన్ పత్రాలు స్వామి వారి ముందు ఉంచి పూజలు చేయించారు. సిద్దిపేటలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను హరీష్ రావు స్వాగతం పలికారు. అక్కడినుంచి కేసీఆర్ తో పాటు కొనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. ఆలయ పూజారులు, అధికారులు కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. ప్రతీ ఎన్నికల సమయంలోనూ సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం కోనాయిపల్లి గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలకి పూజ చేయించడం కెసిఆర్ కు ఆనవాయితీ. గత 38 ఏళ్లుగా కెసిఆర్ కోనాయిపల్లి వెంకన్న ఆలయంలో పూజలు చేస్తున్నారు. ఇప్పుడూ అదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు.


నామినేషన్ల స్వీకరణ మొదలైన నేపథ్యంలో శనివారం నాడు కెసిఆర్ సిద్దిపేటలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ముందుగా అక్కడ కోనాయిపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించుకున్నారు. వెంకటేశ్వర స్వామి ముందు నామినేషన్ పత్రాలను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రి హరీష్ రావు కూడా వెళ్ళారు. ఆలయంలో పూజల తర్వాత అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకాలు పెట్టనున్నారు. నామినేషన్ల సమర్పణకు కూడా ఇప్పటికే తేదీని నిర్ణయించుకున్నారు. సీఎం కేసీఆర్ ఈనెల తొమ్మిదవ తేదీన కామారెడ్డి, గజ్వేల్ లో నామినేషన్లు వేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement