Saturday, May 4, 2024

ADB: ప్రజా ఆశీర్వాదంతో హ్యాట్రిక్‌ సాధిస్తా… మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

నిర్మ‌ల్ ప్రతినిధి, అక్టోబ‌ర్ 18 (ప్రభ న్యూస్) : ప్రజా ఆశీర్వాదంతో హ్యాట్రిక్ విజయం సాధిస్తానని అటవీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి, నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. నిర్మ‌ల్ రూర‌ల్ మండ‌లం ఎల్ల‌ప‌ల్లిలో దుర్గ‌మాత మండ‌పం, అంజ‌నేయ స్వామి దేవాల‌యంలో ప్ర‌త్యేక పూజలు చేశారు. అనంత‌రం కుటుంబ పెద్ద‌ల ఆశీర్వాదం తీసుకున్నారు. స్వంత గ్రామం నుంచి ఎన్నిక‌ల శంఖారావం పూరించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి బీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, మ‌హిళ‌లు, గ్రామ ప్ర‌జ‌లు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. ప్ర‌చార ర‌థం ఎక్కి మంత్రి ఎన్నిక‌ల రంగంలోకి దిగారు. అంత‌కుముందు కుమ్రం భీం, డా.బీఆర్.అంబేడ్క‌ర్ విగ్ర‌హాల‌కు పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.

ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో మంత్రి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ సార‌ధ్యంలో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేసిన‌ అభివృద్ధి, సంక్షేమ పథకాలే పార్టీ విజయానికి సోపానాలన్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 100సీట్ల గెలుపే ల‌క్ష్యంగా ముందుకు వెళ్ళుతున్నామ‌ని, రాష్రంలో అందుతున్న ప్ర‌భుత్వ సంక్షేమ ఫ‌థ‌కాలే బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామ ర‌క్ష అని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న పనులను వివరించి భవిష్యత్తులో మరింత అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలని ప్రజల ముందుకు వెళ్ళుతున్నామ‌న్నారు. ఈ తొమ్మ‌దిన్న‌ర ఏండ్ల‌లో చేసిన అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు, బీఆర్ఎస్ మేనిపెస్టోను వివ‌రిస్తూ ఓట్లు అడుగుతామ‌ని వివ‌రించారు. అన్నివ‌ర్గాల అభ్యున్న‌తికి తోడ్ప‌డే విధంగా మేనిపెస్టో ఉంద‌ని, బీఆర్ఎస్ పార్టీ హ్యట్రిక్ విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌న్నారు.

గతంలో ఎన్నడూలేని విధంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నిర్మ‌ల్ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించగలిగామ‌ని, రైతుబంధు, రైతుబీమా, రుణ‌మాఫీ, ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి ప‌థ‌కాల‌ ద్వారా వేలాదిమంది లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో చేసిన అభివృద్ధి కండ్ల ముందే కనబడుతున్నదని, అభివృద్ధి ఫలాలు పొందుతున్న‌.. నిర్మ‌ల్ ప్రజలు మరోసారి ఆశీర్వాదిస్తార‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. వారందరి ఆశీర్వాదంతో మూడోసారి ఎమ్మెల్యేగా హ్య‌ట్రిక్ విజ‌యం సాధిస్తాన‌ని ఆయన ధీమా వ్య‌క్తం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement