Tuesday, May 7, 2024

Hyd | విధ్యాస్ ఓవ‌ర్సీస్ ఇమ్మిగ్రేష‌న్ స‌ర్వీస్ సెంట‌ర్.. ప్రారంభించిన ఎమ్మెల్యే వివేకా

కుత్బుల్లాపూర్​ (ప్రభన్యూస్​) : హైద‌రాబాద్‌లోని జీడిమెట్లలో నూతనంగా ఏర్పాటు చేసిన విధ్యాస్ ఓవర్సీస్, ఇమ్మిగ్రేషన్ సర్వీస్ కన్సల్టెన్సీని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఇవ్వాల (శ‌నివారం) ప్రారంభించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని సూచిత్ర రోడ్డులో విధ్యాస్ ఓవర్సీస్, ఇమిగ్రేషన్ సర్వీస్ కన్సల్టన్సీని నూత‌నంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవలందించి, వారి మన్ననలు పొందాలని కోరారు. కార్యక్రమంలో నిర్వాహకులు, త‌దిత‌రులు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement