Sunday, April 28, 2024

అంబేద్కర్ కు నివాళులర్పించిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా

భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలు హయత్ నగర్, రాములు ఆధ్వర్యంలో సరూర్ నగర్, వెంకట్ ఆధ్వర్యంలో చంపాపేట్, డా.బాలు ఆధ్వర్యంలో జరిగిన అంబేద్క‌ర్ జ‌యంతి కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం పూర్వ చైర్మన్, ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఐవీఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వారిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఉప్ప‌ల‌ శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ… డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అట్టడుగు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడన్నారు. ఆ మహానుభావుని గురించి ఎంత మాట్లాడినా తక్కువేనన్నారు. ఎన్నో కష్టాలు అనుభవించిన ఆయన కష్టపడి చదివి, రాజ్యాంగం రాసి, ఈ దేశానికి దిక్సూచిగా మారాడన్నారు. దళితులు అభివృద్ధి చెందినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రమ‌న్న‌ అంబేద్కర్ మాటను అభినవ అంబేద్కర్ సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నార‌న్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నడిబొడ్డున, హుస్సేన్ సాగర్ ఒడ్డున 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు. తెలంగాణ నూతన సచివాలయానికి బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం ద్వారా, దళిత బంధు పథకం ప్రవేశ పెట్టడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో అభినవ అంబేద్కర్ గా మారారన్నారు. ఈ కార్యక్రమంలో.. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, హయత్ నగర్ మాజీ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డి, అరవింద్, బాబయ్య యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చంపాపేట్ గణేష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, దళిత నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement