Sunday, April 28, 2024

ఎడిటోరియ‌ల్ – ప్ర‌తిప‌క్షాల అవ‌స‌రార్థ‌ చ‌ర్చ‌లు..

ప్రతిపక్షాలను చీల్చేందుకు అధికార పార్టీ ప్రయ త్నించినప్పుడల్లా, ప్రతిపక్షాలు సమావేశమవుతూ కొత్త పొత్తుల కోసం,కూటముల ఏర్పాటు కోసం కసరత్తులు జరుపుతూ ఉంటాయి. ఇప్పుడు అలాంటిదే మరో ప్రయ త్నం జరుగుతోంది. ప్రతిపక్ష నాయకుల్లో దిగ్గ జమైన ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ ఈ మధ్య తన ప్రకటనల ద్వారా కొత్త సంకేతాలిస్తున్నారు. ప్రతి పక్షా లకు దూరంగా జరుగు తున్నారు. గౌతమ్‌ అదానీపై అమెరికా కంపెనీ హిం డెన్‌బర్గ్‌ వెల్లడించిన అంశాలపై వాస్తవాలను వెలికి తీయడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేయాలని పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో ప్రతిపక్షాలన్నీ ముక్త కంఠంతో డిమాండ్‌ చేయడమే కాకుండా,పార్లమెంటును సాగ నివ్వకుండా స్తంభింప జేశాయి. ఆ యత్నాల్లో పవార్‌ పాల్గొనకపోయినా, జేపీసీ డిమాం డ్‌ విష యంలో ఇతర ప్రతిపక్షాలతో విభేదించారు. దానికన్నా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ విచారణ చాలునని స్పష్టం చేశారు. పవార్‌ వాదనను అంగీకరిస్తే, అదానీకీ, ప్రధాన మంత్రి మోడీకి మధ్య సంబంధాలను నిగ్గు తేల్చేందు కు అవకాశం ఉండదని ఇతర ప్రతిపక్షాల అభి ప్రాయం. ప్రధానమంత్రి మోడీ పవార్‌ని తన వైపు తిప్పుకుం టున్నారేమోనన్న అనుమానం ప్రతిపక్షాల్లో ఏర్ప డింది.

ఆయనను తిరిగి ప్రతిపక్ష శిబిరంలోకి తేవడానికి బీహార్‌ ముఖ్య మంత్రి,జేడీయూ నాయకుడు నితీశ్‌ కుమార్‌ని పంపా లని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. ఈ విషయమై చర్చించేందుకు బుధవారం నాడు ఢిల్లిలో బీజేపీ యేతర నాయకులంతా సమావేశమయ్యారు. మోడీని గట్టిగా వ్యతిరేకిస్తున్న నితీశ్‌కుమార్‌ ఇందుకు తగిన నాయకునిగా ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ప్రతి పక్షాల ఐక్యత తక్షణావసరంగా ఈ పార్టీలు గురి ్తస్తున్నాయి. రానున్న పార్లమెంటు ఎన్నికలకేకాకుండా, కర్నాటక, మధ్య ప్రదేశ్‌, తదితర రాష్ట్రాల అసెంబ్లిd ఎన్నికల్లో కలిసి పోటీ చేయాల్సిన అవసరాన్ని కాంగ్రెస్‌ కూడా గుర్తించింది. ఢిల్లిd సమావేశానికి కాంగ్రెస్‌ నాయ కుడు రాహుల్‌ గాంధీ కూడా హాజరయ్యారు.భావ సారూప్యత గల పార్టీలతో కలసి పని చేయడానికి సిద్ధమేనని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ప్రకటించారు.ఈ యత్నాలకు ఊపు ఇవ్వడం కోసమే ఆమె ఆ ప్రకటన చేసి ఉంటారు. బీజేపీని గద్దె దింపాలనే విషయంలో ఈ పార్టీలన్నింటి అభి ప్రాయం ఒకటే.అయితే, వ్యక్తిగత ప్రతిష్టలు,స్నేహాలు కారణంగా భిన్న రీతుల్లో ప్రకటనలు చేస్తుంటాయి. ఉదాహరణకు శరద్‌ పవార్‌ విషయమే తీసుకుంటే, ఆయనకు కార్పొరేట్‌ రంగంలో మిత్రులు ఎంతో మంది ఉన్నారు.వారు చెప్పినట్టుగా ఆయన నిర్ణ యాలు తీసుకుంటారనే ప్రచారం ఉంది.అది నిజం కూడా కావచ్చు.గౌతమ్‌ అదానీతో ఆయనకు పరి చయాలు, మిత్రత్వం ఉండి ఉండవచ్చు.అంబానీతో కూడా ఆయనకు మైత్రి ఉంది.ఈ నేపధ్యం నుంచి ఆలోచిస్తే,అదానీకి చేటు తెచ్చే నిర్ణయాలను ఆయన తీసుకోలేరు. మోడీకి ఈ విషయం తెలుసు కనుకనే, ఆయన పవార్‌ని తన వైపునకుతిప్పుకునే ప్రయత్నం చేస్తు న్నారు. గతంలో కేంద్ర మంత్రిగా వ్యవహరించిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గులామ్‌ నబీ ఆజాద్‌ని కూడా ఆ పార్టీ నుంచి బయటపడేట్టు చేశారు.

ఇప్పుడు అదే రీతిలో మరో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ అసమ్మతి స్వరం వినిపించేట్టు చేయడంలో మోడీ ప్రోద్బలం ఉండి ఉంటుంది.రాష్ట్రాల్లో చాలా కాలంగా ముఖ్యమైన పదవుల్లో స్థిరపడిన వారిలో అసంతృప్తినీ, పొర పొచ్చా లను ఆసరగా చేసుకుని ఫిరాయింపులను ప్రోత్సహించడంలో హోం మంత్రి అమిత్‌ షా అందెవేసినచేయి. మహా రాష్ట్రలో శివసేన చీలిక వర్గం నాయ కుడు ఏక్‌నాథ్‌ షిండే తో బీజేపీ పొతు కుదర్చడంలో అమిత్‌ షా ప్రధాన పాత్ర వహించారు.షిండే నేతృత్వంలోని చీలిక వర్గంతో బీజేపీ పొత్తు సరిగా పొసగడం లేదు. అందువల్ల పవార్‌వంటి సీనియర్‌ నాయకుణ్ణి తమ వైపు తిప్పుకుంటే, మహా రాష్ట్రలో సంకీర్ణ మంత్రివర్గానికి ఢోకా ఉండదు. పవార్‌పార్టీ ఇప్పుడు జాతీయ హోదాని కోల్పోవడం వల్ల ఆ పార్టీకి అధికార బీజేపీ అండ కావల్సి ఉంటుంది. అందుకే, ఎవరి అవసరాల కోసం వారు దగ్గరవుతు న్నారు. ఈ నేపధ్యం నుంచి పవార్‌తో చిరకాల స్నేహాన్ని పురస్కరించుకుని ఆయనకు నచ్చజెప్పేందుకు నితీశ్‌ని రంగంలో దింపాలని ప్రతిపక్షాల ఆలోచనై ఉండవచ్చు. అయితే, ఆ యత్నం ఫలిస్తుందో లేదో చెప్పలేం.పవార్‌కి అదానీతో మైత్రి కన్నా, మహారాష్ట్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం అవసరం.

Advertisement

తాజా వార్తలు

Advertisement