Monday, April 29, 2024

HYD: నిరుపేద యువతుల వివాహానికి అండగా ఉప్పల ఫౌండేషన్… ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా

హైద‌రాబాద్ : పేదింటి ఆడపడుచులకు పుస్తె మట్టలు, మంగళ సూత్రం, చీర గాజులు పంపిణీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంద‌ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు.

సికింద్రాబాద్ కు చెందిన నిరుపేద ఎస్సీ కుటుంబానికి చెందిన రేణుక – శేఖర్ ల‌ కుమార్తె దివ్య వివాహానికి వెళ్లి అలాగే హైదరాబాద్ కు చెందిన ఎస్సీ కుటుంబానికి చెందిన రేణుక -సత్యనారాయణ కుమార్తె భార్గవి వివాహానికి ఉప్పల శ్రీనివాస్ గుప్తా వివాహానికి చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో జనార్ధన్ మూర్తిల‌ ఆధ్వర్యంలో పుస్తె మట్టలు, చీర, గాజులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నిరుపేద ఆడబిడ్డలను ఆదుకోవడం ఆనందంగా ఉందని, తనకు తోచిన విధంగా సహాయం చేస్తున్నట్టు ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. తమకు అండగా నిలుస్తున్న ఉప్పల శ్రీనివాస్ గుప్తాకు ఆ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement