Sunday, April 28, 2024

TSPSC – గ్రూప్ 4 హాల్ టిక్కెట్స్ విడుద‌ల …వెబ్ సైట్స్ నుంచి డౌన్ లోడ్

హైద‌రాబాద్ : జులై 1వ తేదీన నిర్వ‌హించ‌నున్న గ్రూప్-4 రాత‌ప‌రీక్ష‌కు హాల్ టికెట్ల‌ను టీఎస్‌పీఎస్సీ విడుద‌ల చేసింది. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో హాల్ టికెట్ల‌ను అందుబాటులో ఉంచారు అధికారులు. పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందు వరకు ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉండ‌నున్నాయి. అభ్య‌ర్ధులు ఈ హాట్ టిక్కెట్స్ ను వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు..

కాగా, జూలై 1వ తేదీన రెండు సెషన్లలో పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి రెండు గంటల ముందే చేరుకోవాల్సి ఉంటుందని అధికారులు సూచించారు. ఉద‌యం, మ‌ధ్యాహ్నం సెష‌న్‌కు 15 నిమిషాల ముందే ప‌రీక్షా కేంద్రాల గేట్ల‌ను క్లోజ్ చేయ‌నున్న‌ట్లు హాల్ టికెట్ల‌లో పేర్కొన్నారు. అయితే అభ్య‌ర్థులెవ‌రూ షూ ధ‌రించి రావొద్ద‌ని అధికారులు పేర్కొన్నారు. కేవ‌లం చెప్పులు మాత్ర‌మే ధ‌రించాల‌ని ఆదేశించింది. ఎటువంటి ఎల‌క్ట్రానిక్స్ గాడ్జెట్స్ ఉండ‌కూడ‌ద‌ని పేర్కొంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement