Sunday, May 5, 2024

Car Driver: డ్రైవ‌ర్ కు గుండెపోటు.. డ్రైవింగ్ సీటులోనే కన్నుమూసిన డ్రైవర్

ఓ కారు డ్రైవర్ డ్రైవిగ్ చేస్తుండగా గుండెపోటుకు గురై కన్నుమూసిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ప్రయాణికుడిని పికప్ చేసుకోవడానికి వెళుతుండగా డ్రైవర్ గుండెపోటుతో చనిపోయాడు. నగరంలోని చాంద్రాయణగుట్టలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బడంగ్ పేట్ కు చెందిన జె.ధనుంజయ్ (41) ఓ ప్రైవేటు ట్రావెల్స్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య పదేళ్ల కూతురు, ఎనిమిదేళ్ల కొడుకు ఉన్నారు.

రోజూలాగే డ్యూటీకి బయలుదేరిన ధనుంజయ్.. ట్రావెల్స్ ఆఫీసుకు చేరుకున్నాడు. పాతబస్తీ లాల్ దర్వాజ ప్రాంతంలో ఓ ప్రయాణికుడిని పికప్ చేసుకోవడానికి కారు తీసుకుని వెళ్లాడు. నల్లవాగు సమీపంలోకి చేరుకున్న తర్వాత ధనుంజయ్ అస్వస్థతకు గురయ్యాడు. గుండె నొప్పిగా అనిపించడంతో ధోబీఘాట్ వద్ద కారును పక్కకు ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే, కారును నియంత్రించలేకపోయాడు. దీంతో కారు డివైడర్ పైకెక్కి ఆగిపోయింది. మిగతా వాహనదారులు వచ్చి చూసేసరికి ధనుంజయ్ స్టీరింగ్ పై తలవాల్చేసి కనిపించాడు. స్థానికులతో కలిసి పోలీసులు ధనుంజయ్ ను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ధనుంజయ్ చనిపోయాడని వైద్యులు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement