Friday, April 26, 2024

ఉగాది వేడుకకు ముస్తాబైన దేవాలయాలు..

సికింద్రాబాద్ : ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించడానికి సికింద్రాబాద్‌లోని దేవాలయాలు ముస్తాబయ్యాయి. సాంప్రదాయసిద్దంగా ఉగాది వేడుకలను దేవాలయాలలో నిర్వహించుకోవడం అనాధిగా కొనసాగుతున్న ఆచారం. ఉగాది పర్వదినం రోజున దేవాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, విశేష అర్చనల కార్యక్రమాలతోపాటు ప్రధానంగా భవిష్యత్తు వాణిని తెలుసుకునే పంచాంగ శ్రవణం అనే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం తెలుగువారి సాంప్రదాయంగా వస్తోంది. అయితే కరోనా విజృంబిస్తుండడంతో మంగళవారం జరుపుకునే ఉగాది పండుగ రోజున కొవిడ్‌ నిబంధనాలు పాటిస్తూ దేవాలయంలో స్వామి వారి దర్శనం చేసుకొవాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. శ్రీ ప్లవనామ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఉగాది వేడుకలను నిర్వహించడానికి సికింద్రాబాద్‌లోని దేవాలయాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యంగా సికింద్రాబాద్‌లో ప్రఖ్యాతిగాంచిన గణపతి దేవాలయంలో ప్రతియేటా ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. శ్రీ ప్లవనామ సంవత్సరాన్ని పురస్కరించుకొని మంగళవారం ఉదయం ప్రత్యేక అభిషేకాలను విఘ్నేశ్వరుడికి నిర్వహిస్తున్నారు. అదే విధంగా సికింద్రాబాద్‌ శ్రీ ఉజ్జయినీమహంకాళి దేవాలయం, ఎస్పీ రోడ్‌లోని శ్రీ వీరహనుమాన్‌, ప్రకాశ్‌నగర్‌లోని శ్రీ రామలింగేశ్వరస్వామి, మారేడుపల్లిలోని శ్రీ సుబ్రమణశ్వరస్వామి, సితాఫల్‌మండిలోని రామలయం తదితర ప్రాంతంలో ఉన్న దేవాలయంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలు ఉగాది నుండి మొదలుకొని శ్రీరామనవమి వరకు కొనసాగుతాయి. ఉగాది రోజున పెద్దఎత్తున్న భక్తులు తరలిరానున్న దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గత వారం రోజుల నుండి సెకండ్‌ వేవ్‌ కరోనా విజృంబిస్తుండడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఆలయానికి వచ్చే భక్తులు తప్పనసరి మాస్కులు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. బౌతిక దూరం పాటిస్తూ స్వామి దర్శనం చేసుకొవాలన్నారు. ఉగాది రోజున సెలవు దినం కాబట్టి అందరు ఇంటిపట్టునే ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజురోజుకు కేసులు పేరుగుతున్న దృష్ట్యా మరింత జాగ్రత్త ఉండాలని కోరుతున్నారు. ముఖ్యంగా ఆలయాలకు వెళ్లే భక్తులు అధిక జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement