Saturday, April 27, 2024

వణికిస్తున్న చలి.. న‌గ‌రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు …

హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో చ‌లి తీవ్ర‌త రోజురోజుకు పెరుగుతుంది. ద‌ట్ట‌మైన పొగమంచు క‌మ్ముకుంటుండ‌డంతో ఉద‌యం 8 గంట‌ల వ‌ర‌కు రోడ్లు స‌రిగా క‌నిపించ‌డం లేద‌ని వాహ‌న‌దారులు అంటున్నారు. రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో చలితో ప్రజలు వణికిపోతున్నారు. బుధవారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు డిగ్రీలు తగ్గాయి. రాజేంద్రనగర్‌లో 14.6, సరూర్‌నగర్‌లో 14.9, సికింద్రాబాద్‌, గాజులరామారం, అల్వాల్‌లో 15.0 డిగ్రీలు నమోదయ్యాయి. శివారు ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల నుంచే శీతల గాలులు వీస్తుండడం, తెల్లవారు జామున మంచు కురుస్తుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఉద‌యం పూట ఉద్యోగాలకు వెళ్లే వారికి చ‌లితో ఇబ్బందు త‌ప్ప‌డం లేదు. సొంత వాహ‌నాల్లో వెళ్లే వారు జాగ్ర‌త్త‌గా వెళ్లాల్సి వ‌స్తుంది. ఉద‌యం స‌మ‌యంలో రోడ్లు పొగ‌మంచుతో క‌మ్మేసి ఉంటున్నాయ‌ని వాహ‌న‌దారులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement