Thursday, April 18, 2024

బిగ్ బాస్ లో రేవంత్.. పండంటి ఆడ‌పిల్ల‌కి జ‌న్మ‌నిచ్చిన సింగ‌ర్ భార్య‌

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది సింగ‌ర్ రేవంత్ భార్య అన్విత. ఈ విషయాన్ని అన్విత సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.తనకు కూతురు పుట్టిందని తెలిస్తే రేవంత్ ఎంత సంతోషిస్తాడో అని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.కాగా రేవంత్ తనదైన శైలిలో బిగ్ బాస్ రియాల్టీ షోలో రాణిస్తున్నారు. బిగ్ బాస్ లోకి వచ్చే నాటికే అన్విత నిండు గర్భిణి. రేవంత్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే ఆమె సీమంతం జరిగింది.

సీమంతం వీడియోను చూసి రేవంత్ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఎమోషన్ తో కంటతడి పెట్టుకున్నారు. చిన్నప్పుడే తాను తండ్రిని కోల్పోయానని… తండ్రి లేని లోటు ఎలా ఉంటుందో తనకు తెలుసని… అందుకే ‘నాన్నా’ అని ఎప్పుడెప్పుడు పిలిపించుకోవాలా అనే ఆత్రుతతో ఉన్నానని రేవంత్ బిగ్ బాస్ హౌస్ లో చెప్పారు. ఇప్పుడు ఆయన కల నెరవేరింది. నాన్నా అని పిలిచేందుకు చిన్నారి ఆ ఇంట అడుగుపెట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement