Friday, May 3, 2024

ఈనెల 12 నుంచి 17వరకు ఆర్ఆర్ బీ ఎన్టీపీసీ పరీక్షలు

ఈనెల 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఆర్ఆర్ బీ ఎన్టీపీసీ పరీక్షలు నిర్వహిం‌చనున్నారు. రైల్వే రిక్రూ‌ట్‌‌మెంట్‌ బోర్డు (ఆ‌ర్‌‌ఆ‌ర్‌బీ).. సికిం‌ద్రా‌బాద్‌ ఎన్‌‌టీ‌పీసీ సీబీటీ 2 ఉద్యో‌గాల భర్తీ కోసం ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీ‌క్షలు రాసే అభ్యర్థుల సౌక‌ర్యార్థం షాలి‌మా‌ర్‌-సి‌కింద్రా‌బాద్‌, బిలా‌స్‌‌పూ‌ర్‌-సి‌కింద్రా‌బాద్‌, భువ‌నే‌శ్వర్‌-‌తం‌బా‌రామ్‌, గుంటూ‌రు-భ‌ద్రక్‌ స్టేషన్ల మార్గా‌లలో ఈ నెల 10, 11, 13 తేదీ‌లలో ప్రత్యేక రైళ్లు నడు‌ప‌ను‌న్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధి‌కా‌రులు తెలి‌పారు.

ఏ తేదీన ఏ పరీక్ష అంటే..
సికింద్రాబాద్‌, భువనేశ్వర్‌, చండీగఢ్‌, బిలాస్‌పూర్‌, ముంబై, గోరఖ్‌పూర్‌, రాంచీ, ముజఫర్‌పూర్‌లో..
జూన్‌ 12న లెవల్‌-5 పరీక్ష
జూన్‌ 13న లెవల్‌-2
జూన్‌ 14న లెవల్‌-3

అజ్మీర్‌, అహ్మదాబాద్‌, బెంగళూరు, భోపాల్‌, చెన్నై, గువాహటి, జమ్ము -శ్రీనగర్‌, కోల్‌కతా, పట్నా, సిలిగురి, అలహాబాద్‌, మాల్దా, తిరువనంతపురంలో..
జూన్‌ 15న లెవల్‌ 5
జూన్‌ 16న లెవల్‌ 2
జూన్‌ 17న లెవల్‌ 17

Advertisement

తాజా వార్తలు

Advertisement