Sunday, April 28, 2024

30వ తేది వ‌ర‌కు తెలంగాణ‌లో వాన‌లే….

హైదరాబాద్‌, : రాష్ట్రంలో వానలు ఆగేలా కనిపించడం లేదు. వాతా వరణ అధికారుల సమాచారం ప్రకారం ఈ నెల 30వరకూ వానలు కురవ నున్నాయి. ఇప్పటికే ఏప్రిల్‌ మొద టివారం చివరి నుంచి వర్షాలు కురస్తుం డగా తాజాగా ఈ నెల 30వరకూ వానలు కురుస్తాయనడంతో వానలు ఇప్పట్లో ఆగేటట్టు లేవని వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌క‌టించింది. మరట్వాడా నుంచి ఇంటీరీయర్‌ కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తా తమిళ నాడు వరకు సముద్రమట్టానికి 0.9కిమీ ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో గంటకు 30నుంచి 40కిలోమీటర్ల బలమైన గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడి తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు తెలంగాణలోని పలు జిల్లాల్లో కురవనున్నట్టు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement