Friday, May 3, 2024

హెచ్‌సీయూ విద్యార్థిని ఆత్మహత్య కేసు.. అధ్యాపకుల వేధింపులే కారణమా?

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థిని మౌనిక ఆత్మహత్య కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. హాస్టల్‌ గదిలో లభించిన మౌనిక ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోన్‌, పెన్‌డ్రైవ్‌ను స్వాధీనం చేసుకుని అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. మౌనిక రాసిన సుసైడ్‌ నోట్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మౌనిక ఆత్మహత్యకు కారణం అధ్యాపకుల వేధింపుల అన్న ఆరోపణలు వినిపిస్తుండటంతో పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం రాత్రి తన క్లాస్‌మేట్‌ సుప్రియతో మౌనిక ఫోన్‌లో చాట్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రాత్రి 11.30 ప్రాంతంలో చివరిగా గుడ్‌నైట్‌ అనే మెసేజ్‌ పెట్టిన ఆమె మరుసటి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు గది నుంచి బయటకు రాలేదు. దీంతో ఆదివారం రాత్రే ఆత్మహత్య చేసుకొని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

ఆత్మహత్యకు ముందురోజు మౌనిక ఎవరితో మాట్లాడిందనే విషయం తెలుసుకునేందుకు పోలీసులు ఆమె స్నేహితులను విచారిస్తున్నారు. ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోన్‌, పెన్‌డ్రైవ్‌లను ఎఫ్‌ఎస్‌ఎల్‌ ల్యాబ్‌కు పంపి అందులో ఉన్న సమాచారం సేకరిస్తున్నారు. సోమవారం అర్థరాత్రి మౌనిక కుటుంబసభ్యులు వచ్చిన తరువాతే పోలీసులు ఆమె మృతదేహాన్ని హాస్టల్‌ గది నుంచి ఉస్మానియా హాస్పిటల్‌కి తరలించారు. యూనివర్శిటీలో వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుని ఉంటుందని మౌనిక తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. 

ఇది కూడా చదవండిః హైదరాబాద్ జంట పేలుళ్లకు 14 ఏళ్లు!

Advertisement

తాజా వార్తలు

Advertisement