Sunday, April 28, 2024

HYD: ‘పాంచి ఐసే ఆతే హై’ ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు… అమోల్ పరాశర్

హైద‌రాబాద్ : పాంచి ఐసే ఆతే హై లో చాలా విస్తృతమైన సందేశం ఉంది, దీనిని దక్షిణ భారతదేశంలోని ప్రేక్షకులు ఆదరిస్తారని నటుడు అమోల్ పరాశర్ అన్నారు. నటుడు విజయ్ టెండూల్కర్ టెలిప్లే పాంచి ఐసే ఆతే హై లో నటించారు. ఇది ఇప్పుడు కన్నడ, తెలుగులో కూడా అందుబాటులో ఉంది. టీవీఎఫ్ ట్రిప్లింగ్, డాలీ కిట్టి ఔర్ వో చమక్తే సితారే వంటి ఓటీటీ ఆఫర్‌లలో, షూజిత్ సిర్కార్ చిత్రం సర్దార్ ఉదమ్ లో దిగ్గజ విప్లవకారుడు భగత్ సింగ్ వంటి చిరస్మరణీయమైన పాత్రలను పోషించిన అమోల్ పరాశర్ అత్యంత ఆసక్తి కరమైన పాత్రలను చేయటం కోసం ఎప్పుడూ ఆసక్తి గా చూస్తుంటారు. అతని అభిమాన కథానాయకులలో ఒకరు అరుణ్. జీ థియేటర్ టెలిప్లే పాంచి ఐసే ఆతే హై లో స్వేచ్ఛాయుతమైన, తెలివైన, రహస్యమైన పాత్ర అది.

తన పాత్ర గురించి అమోల్ మాట్లాడుతూ… అరుణ్ బోహేమియన్ యాత్రికుడు, అతను సారు జీవితంలో మార్పుకు ఉత్ప్రేరకంగా మారాడన్నారు. షారుఖ్ ఖాన్ చాలా చిత్రాల్లో నటించిన మనోహరమైన వ్యక్తిని అతను తనకు గుర్తు చేశాడని అన్నారు. వివాహం విషయంలో మహిళలు అర్హత గురించి కొన్ని సామాజిక భావనలకు కట్టుబడి ఉండాలని ఆశించినప్పటికీ, పురుషులు కూడా పితృస్వామ్య వ్యవస్థకు కట్టుబడి ఉంటారన్నారు. ప్రేమ, వివాహం విషయానికి వస్తే, ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉండాలని ఈ కథ తెలియజేస్తుందన్నారు. ఈ టెలిప్లే కు ఇషాన్ త్రివేది దర్శకత్వం వహించి, చిత్రీకరించారు. రతన్ రాజ్‌పుత్, దీపక్ ఖాజిర్, విభా చిబ్బర్, సందీప్ ధబాలే, వినయ్ విశ్వా కూడా దీనిలో నటించారు. దీన్ని డిసెంబర్ 2న ఎయిర్ టెల్ థియేటర్, డిష్ టివి రంగ్‌మంచ్ యాక్టివ్, డీ2హెచ్ రంగ్‌మంచ్ యాక్టివ్‌లో చూడండని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement