Friday, May 10, 2024

లగ్జరీ ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్‌.. 3వ స్థానంలో హైదరాబాద్‌

సొంతింటి కల నెరవేర్చుకునే వారి అభిరుచులు మారుతున్నాయి. ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉండాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఆర్ధికంగా స్థోమత ఎక్కువ ఉన్నవారు ఈ తరహాలో లభించే లగ్జరీ ఇళ్ల కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ సంవత్సరం జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు ఏడు ప్రధాన నగరాల్లో 4 కోట్లకు పైగా విలువైన లగ్జరీ హోమ్స్‌ విక్రయాలు పెద్ద సంఖ్యలో పెరిగాయి. గత సంవత్సరంతో పోల్చితే లగ్జరీ హోమ్స్‌ అమ్మకాలు 97 శాతం పెరిగినట్లు రియల్‌ ఎస్టేట్‌ సంస్థ సీబీఆర్‌ఈ తన నివేదికలో పేర్కొంది.

3వ స్థానంలో హైదరాబాద్‌…

లగ్జరీ ఇళ్ల విక్రయాల్లో ఏడు ప్రధాన నగరాల్లో హైదరాబాద్‌తో పాటు ఢిల్లిd-ఎన్‌సీఆర్‌, ముంబై నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయి. లగ్జరీ ఇళ్ల అమ్మకాల్లో 37 శాతం వాటాతో ఢిల్లి-ఎన్‌సీఆర్‌ అగ్రస్థానంలో ఉంది. 35 శాతం అమ్మకాలతో ముంబై రెండో స్థానంలో, 18 శాతం అమ్మకాలతో హైదరాబాద్‌ మూడో స్థానంలో ఉంది. పుణేలో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 4 శాతంగా ఉన్నాయని నివేదిక తెలిపింది.

- Advertisement -

పండగ సీజన్‌ కావడంతో డిసెంబర్‌ నెలల్లో మరింత స్థాయిలో విక్రయాలు నమోదయ్యే అవకాశం ఉందని సీబీఆర్‌ తెలిపింది. తొలిసారిగా లగ్జరీ ఇళ్లను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగిందని తెలిపింది. దేశ ఆర్ధిక వ్యవస్థ పెరగడంతో పాటు, డెవలపర్లు అందిస్తున్ను ప్రోత్సహకాలు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయని నివేదిక తెలిపింది. స్మార్ట్‌ స్విచ్‌, మొబైల్‌తో ఆపరేట్‌ చేయగలిగే సాంకేతికతతో కూడిన స్మార్ట్‌హోమ్‌ టెక్నాలజీ పట్ల మక్కువ పెరగడంతో లగ్జరీ గృహాలు పెరుగుతున్నాయని తెలిపింది. లగ్జరీ ఇళ్ల కొనుగోలుదారుల్లో ధనికులు, ఎన్‌ఆర్‌ఐలు ఉన్నారని నివేదిక తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement