Tuesday, May 14, 2024

ఓడిన్ స్కూల్స్ ఔత్సాహిక నిపుణుల కోసం జావా డెవలపర్ బూట్‌క్యాంప్‌

డేటా సైన్స్ బూట్‌క్యాంప్‌తో గణనీయమైన విజయాన్ని సాధించిన తర్వాత, ఓడిన్‌స్కూల్ ఫుల్-స్టాక్ జావా డెవలపర్ బూట్‌క్యాంప్‌ను ప్రారంభించింది. ఈ సంద‌ర్భంగా ఓడిన్‌స్కూల్ సీఈఓ విజయ్ పసుపులాటి మాట్లాడుతూ… డేటా సైన్స్ బూట్‌క్యాంప్‌తో త‌మ‌ విజయం తర్వాత, ఫుల్ స్టాక్ డెవలపర్‌ల కోసం పరిశ్రమ నుండి భారీ ఇన్‌కమింగ్ ఆసక్తిని తాము చూశామన్నారు. ఓడిన్ స్కూల్స్ ఫుల్ స్టాక్ జావా డెవలపర్ బూట్‌క్యాంప్ పరిశ్రమ ఈ డిమాండ్‌ను నెరవేరుస్తుందన్నారు. ఓడిన్‌స్కూల్‌లోని కార్పొరేట్ రిలేషన్స్ అండ్ ప్లేస్‌మెంట్స్ హెడ్ శ్రుతి గడ్డం మాట్లాడుతూ… కార్పోరేట్ రంగానికి చెందిన నిపుణులతో త‌మ పరస్పర చర్యలు ముఖ్యంగా భారతదేశంలో నైపుణ్యం కలిగిన ఫుల్ స్టాక్ డెవలపర్‌ల అవ‌శ్య‌క‌త‌, డిమాండ్ చాలా ఉందన్నారు. ఈ డొమైన్‌లో చాలా అవకాశాలున్నప్పటికీ, నైపుణ్యం అంతరం భారీగానే ఉందన్నారు. త‌మ బూట్‌క్యాంప్ పరిశ్రమల్లో ఉద్యోగ అవ‌కాశాలు భారీగా ఉన్న కోర్సు అని శ్రుతి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement