Sunday, April 28, 2024

మిష‌న్ భ‌గీర‌థ‌కి సాయ‌మేది..రాజ్య‌స‌భ‌లో కేంద్రాన్ని నిల‌దీసిన ఎంపి సంతోష్ కుమార్..

హైదరాబాద్‌, : కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా పంచే విషయం లో 15వ ఆర్థిక సంఘం అవలంబించిన విధానం సరిగా లేదని, ఈ విధానం కార ణంగా వృద్ధిలో దూసుకుపోతున్న తెలం గాణ లాంటి రాష్ట్రాలకు ప్రోత్సాహం కరు వైందని రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌ అన్నారు. ద్రవ్యవినిమయ బిల్లు (2021-22) పై చర్చలో భాగంగా మంగళ వారం రాజ్యసభలో ఆయన మాట్లాడారు. బడ్జెట్‌ అంచనాలపై చర్చించి వాటిపై స్పందన తెలియజేసే ఈ బడ్జెట్‌ సమావేశాలు దేశంలో ప్రజాస్వామ్య గొప్పదనాన్ని తెలియ జేస్తు న్నాయన్నారు. సీఎం కేసీఆర్‌ నాయక త్వంలో తెలంగాణ రాష్ట్రంలో మిషన్‌ భగీ రథ పథకాన్ని సంపూర్ణంగా అమలు చేశా మని ఇంటింటికి తాగునీరు అందించే ఈ స్కీమ్‌ పూర్తి చేసి తెలంగాణ దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచిందన్నారు. ‘మిషన్‌ భగీర థ పథకానికిగాను రూ.30 వేల కోట్లను ఖ ర్చు చేయడంతో పాటు పథకాన్ని 98 శాతం పూర్తి చేశాం. ఈ స్కీమ్‌నకు 25వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వా నికి పలు సంస్థలు సిఫారసు చేసినా ఎలాంటి సాయం అందలేదు. ఇంటింటికి తాగునీరు అందించే పథకాన్ని విజయవంతంగా పూర్తి చేసినందున జలజీవన్‌ మిషన్‌ కింద నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం. వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి కోసం తెలం గాణకు కేటాయించిన నిధులను తక్షణమే విడుదల చేయాలి. తెలంగాణకు కేటాయించిన రూ.1350 కోట్ల ప్యాకేజీని వెంటనే విడుదల చేయండి. 13వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన రూ.1114 కోట్లు 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన రూ.817 కోట్ల విడుదలలో కేంద్రం జాప్యం చేస్తోంది. 2021-26 మధ్య కాలానికి గాను 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ రూ.3024 కోట్లను సిఫార సు చేసింది. తెలంగాణ కోసం నిర్ధిష్ట గ్రాంటుగా రూ.2350 కోట్లను విడుదల చేయవ చ్చని పార్లమెంటు కార్యాచరణ కమిటీ నివేదికలో పొందుపరిచారు. కమిటీ పేర్కొన్న ట్లు 15వ ఆర్థిక సంఘం సిఫారసును పరిశీలించి కేంద్రం నిధులు విడుదల చేయాలి. కోవిడ్‌ సంక్షోభ పరిస్థితుల్లోనూ ఈ ఆర్థిక ఏడాదిలో 10.52 లక్షల కోట్లు అప్పులు చేసి మరీ ప్రజలకు ఆహార ధాన్యాలు సరఫరా చేయడం, ఆరోగ్యరంగంపై ఖర్చుపెట్టడం, ఉపాధి హామీ ద్వారా మరింత ఉపాధి హామీ ఖర్చు పెట్టి ఆర్థిక వ్యవస్థను నెట్టుకొస్తున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు హ్యాట్సాఫ్‌ అని సంతోష్‌ కొనియాడారు. బడ్జెట్‌కు సంబంధించి ప్రస్తుత గణాంకాలు ఎలా ఉన్నప్పటికీ వృద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement