Thursday, May 9, 2024

ఎల్బీనగర్ అభివృద్ధికి నిరంతరం కృషి : ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్ ఆగస్టు 13 ( ప్రభ న్యూస్). ఎన్నికలు సమీపిస్తున్నాయని కొంతమంది సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని అవేమీ పట్టించుకోకుండా ఎల్బీనగర్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు.
మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీ సంక్షేమ సంఘ సభ్యుల ఆత్మీయ సమావేశం ఆదివారం ఎం ఇ రెడ్డి గార్డెన్ లో నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీవాసులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు.

అనంతరం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, డివిజన్ లోని రిజిస్ట్రేషన్ సమస్య ఉన్నా 6 కాలనీలకు 118 తో పరిష్కరించామని తెలిపారు. ఆటోనగర్ డంపింగ్ యార్డ్ స్థలంలో ఫ్లవర్ పార్కు ఏర్పాటు కోసం 121 కోట్లతో ప్రతిపాదనలు పంపామని, చిన్న ,చిన్న అడ్డంకులు రావడంతో ఆలస్యం అవుతుందని త్వరలో అందమైన పూలవనం నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. మన్సురాబాద్ – పోచంపల్లి పాత జిల్లా పరిషత్ రోడ్డును పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నార్త్ మల్లికార్జున నగర్ రోడ్డు డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కోటి రూపాయల నిధులు మంజూరు అయ్యాయని త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు . సుష్మ బిగ్ బజార్ ప్రధాన రహదారి విస్తరించి ట్రాఫిక్ సమస్య కు చెక్ పెడతామన్నారు. అనిత నగర్ కాలనీలోని పార్కులు కమిటీ హాల్ ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేస్తామన్నారు. మహిళా మండలి భవనం ఉపాధి కల్పన, ఇందిరానగర్ కాలనీలోని లెవెన్ కె.వి 33 కెవి లైన్ల తొలగింపుకు చర్యలు తీసుకుంటానన్నారు. డివిజన్లోని ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతానని తెలిపారు.అలాగే లోవోల్టేజ్ సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి నూతన ట్రాన్స్ఫార్మర్స్ ఎర్పాటు చేయిస్తామని, మన్సూరాబాద్ పెద్ద చెరువును ఇటీవల గ్రీన్ లీవ్స్ సంస్థ దత్తత తీసుకోవడం జరిగిందని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడంజరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి,డివిజన్ అధ్యక్షులు జక్కిడి మల్లారెడ్డి,కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం మాజీ ఛైర్మన్ ఈశ్వరమ్మ యాదవ్,మాజీ డివిజన్ అధ్యక్షులు టంగుటూరి నాగరాజు,జగదీష్ యాదవ్,యువ నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి,ముద్ద కళ్యాణ్,రుద్ర యాదగిరి నేత,రమేష్,రాంకోటి,జగదీష్ గౌడ్,వెంకన్న,నగేష్ యాదవ్,పారంద నర్సింహా,శ్రీధర్ , విజయ్ శ్రీనగర్ కాలనీ అధ్యక్షులు మోహన్ రెడ్డి, రాజేష్ , చీర్క నర్సిరెడ్డి, జె .జె.రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, అంజయ్య గౌడ్, యం .ధన్ పాల్ గౌడ్ , తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement