Tuesday, April 30, 2024

నిరాడంబరంగా శ్రీరామనవమి వేడుకలు..

హైదరాబాద్ : నిరాడంబరంగా శ్రీరామ నవమి వేడుకలను నిర్వహించనున్నట్లు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గతేడాది కూడా శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా భక్తులకు అనుమతించేదు. కొద్ది రోజులుగా పెరుగుతున్న క‌రోనా కేసులను క‌ట్టడి చేయడానికి అన్ని ‌మ‌తాల పండుగ‌ల నిర్వహ‌ణ‌పై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేర‌కు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.గ‌తేడాదిలో నిర్వహించిన‌ట్లుగానే ప‌రిమిత సంఖ్యలోనే.. కొవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా వేడుక‌ను జ‌రుపుతామ‌ని ఆయ‌న స్పష్టం చేశారు. స్వామివారి ఆల‌యంలోనే ఆగమ శాస్త్ర ప్రకారం న‌వ‌మి వేడుకలను నిర్వహిస్తామన్నారు. కరోనా దృష్ట్యా భక్తులెవరూ సీతారామ కల్యాణాన్ని వీక్షించడానికి భద్రాద్రికి రావొద్దని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందుజాగ్రత్త చర్యగా భక్తుల రాకపై ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, భక్తులు పరిస్థితిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement