Sunday, April 28, 2024

TS | 9 స్థానాల్లో ఎంఐఎం పోటీ.. ఆరుగురు అభ్యర్థులను ప్రకటించిన ఒవైసీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ శాసనసభ ఎన్నికలకు అఖిల భారత మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (ఎఐఎంఐఎం) పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్‌లోని 9 స్థానాల నుంచి తమ పార్టీ అభ్యర్ధులు బరిలో ఉంటారని ఆ పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపి అసదుద్దీన్‌ ఒవైసీ శుక్రవారం దారుసలాంలో ప్రకటించారు. ఏడుగురు సిట్టింగ్‌లతో పాటు, అదనంగా మరో రెండు స్థానాలనుంచి పోటీ చేయనుంది. రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్న తొమ్మిది స్థానాల్లో ఆరుగురిని ప్రకటించగా, మరో ముగ్గురి పేర్లు ఖరారు చేయకుండా పెండింగ్‌లో ఉంచింది.

అయితే ఇప్పటి వరకు సందిగ్ధంలో ఉన్న చార్మినార్‌, యాఖుత్‌పురా నియోజకవర్గాలకు చెందిన ఇద్దరు సిట్టంగ్‌ ఎమ్మెల్యేలు పోటీ చేయడంలేదని ఒవైసీ ప్రకటించారు. గత 2018 ఎన్నికల్లో రాజేంద్రనగర్‌తో సహా 8 స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం ఏడు స్ధానాలు గెలుచుకుని, ఈ నియోజకవర్గం నుంచి చిత్తుగా ఓడిపోయింది. అయితే ఈసారి ఎన్నికల్లో అదనంగా మరో స్థానం నుంచి పోటీ చేయనున్నది.

మజ్లిస్‌ ప్రకటించిన ఆరు స్థానాల్లో నలుగురు సిట్టింగులే, కాగా ఇద్దరు అభ్యుర్థులూ నగర మాజీ మేయర్లే. చాంద్రాయణగుట్ట నుంచి అక్బరుద్దీన్‌ ఒవైసీ, మలక్‌పేట్‌ నుంచి అహమద్‌ బిన్‌ అబ్దుల్లా బలాల, కార్వాన్‌ నుంచి కౌసర్‌ మొహియుద్దీన్‌, యాఖుత్‌పురా నుంచి జాఫర్‌ హుస్సేన్‌ మేరాజ్‌లతో పాటు మాజీ మేయర్‌లైన ముహమ్మద్‌ మాజీద్‌ హుస్సేన్‌ను నాంపల్లి నుంచి, మీర్‌ జుల్ఫిఖార్‌ అలిని చార్మినార్‌ నుంచి పార్టీ ప్రకటించింది. బహాదర్‌పురా, రాజేంద్రనగర్‌, జూబ్లిహిల్స్‌ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారు చేయాల్సి ఉంది.

ఇప్పటి వరకు నాంపల్లి నుంచి ప్రాతినిథ్యం వహించిన జాఫర్‌ హుస్సేన్‌ మేరాజ్‌ను యాఖుత్‌పురాకు మార్చారు. నాంపల్లి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్న ఫేరోజ్‌ ఖాన్‌ మజ్లిస్‌కు సవాల్‌గా మారడంతో ఈ మార్పులు జకిగినట్లు తెలుస్తుంది. రాజేంద్రనగర్‌, జూబ్లిdహిల్స్‌ స్థానాల్లో మజ్లిస్‌కు మిత్రపక్షమైన బిఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలున్నారు. ఈ నియోజకవర్గాల్లో అధికార భారాస, కాంగ్రెస్‌ అభ్యర్థుల మధ్య హోరాహోరి పోటీ ఉన్నందున, ఎంఐఎం తమ అభ్యర్థులను బరిలోకి దించుతన్నట్లు సమాచారం.

- Advertisement -

ముఖ్యంగా జూబ్లిహిల్స్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున బరిలో ఉన్న మాజీ క్రికెటర్‌, భారత కెప్టెన్‌ అజ్హరుద్దీన్‌ భారాసకు సవాల్‌గా మారడంతో, కాంగ్రెస్‌ ఓటు బ్యాంకును ప్రభావితం చేసి, భారాసకు అనుకూలంగా ఎంఐఎం తమ అభ్యర్థిని బరిలోకి దించుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేయని ఇద్దరు మజ్లిస్‌ ఎమ్మెల్యేలైన ముంతాజ్‌ అహమద్‌ ఖాన్‌, సయ్యద్‌ అహమద్‌ పాషా ఖాద్రీలు తమ పార్టీలోనే ఉంటారని ఒవైసీ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement