Tuesday, April 30, 2024

TS: జర్నలిస్టులకు ఇండ్లస్థలాలపై సీఎస్ తో డెక్కన్ జర్నలిస్ట్ సొసైటీ ప్రతినిధుల భేటీ

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఇవాళ డెక్కన్ జర్నలిస్ట్ సొసైటీ ప్రతినిధుల బృందం కలవడం జరిగింది. జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వాలని ప్రతినిధులు సీఎస్ ను కోరారు. ఈ విషయంపై శాంతికుమారి స్పందిస్తూ… జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయంలో తనవంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.

బడుగులు, బలహీనవర్గాలున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో విజయవంతంగా ముందుకెళ్తుందన్నారు. జర్నలిస్టుల కోసం పలు రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశంలోనే తెలంగాణ ఆదర్శవంతంగా నిలిచిందన్నారు. కోవిడ్-19 వంటి విపత్కర సమయంలోనూ జర్నలిస్టులకు అండగా నిలిచి, ఆర్ధిక సాయం అందించిన ప్రభుత్వం తెలంగాణ మినహా దేశంలో మరే రాష్ట్రం లేదన్నారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టుల చిరకాల స్వప్నం సొంతిల్లు, ఈ కలను నిజం చేసే విశాల హృదయం ఈ ప్రభుత్వానికి మాత్రమే ఉందని తాము విశ్వసిస్తున్నామన్నారు. సొంతింటి కల ఈ ప్రభుత్వం ద్వారా సాకారమవుతుందని ఆశిస్తున్నామని కోరారు. దీనిపై స్పందించిన సీఎస్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కోసం తనవంతు కృషి చేస్తానని కోరారు. సీఎస్ ను కలిసిన వారిలో అధ్యక్షులు బొల్లోజు రవి, ఉపాధ్యక్షులు ఎం.శ్రీనివాస్, ట్రెజరర్ సిహెచ్ అయ్యప్ప, డైరక్టర్లు దండా రామకృష్ణ, డి కుమార్, సభ్యులు శ్రీలత, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement