Tuesday, April 30, 2024

Shamshabad: టింబర్‌ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ నగర శివార్లలోని శంషాబాద్‌లో పరిధిలో ఉన్న ఓ టింబర్‌ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున టింబర్‌ కంపెనీలో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి మొత్తానికి విస్తరించడంతో పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. విద్యుదాఘాతంతోనే టింబర్‌ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement