Sunday, May 5, 2024

HYD: రాబోయే రోజుల్లో ప్రపంచ డిమాండ్ ను తీర్చనున్న శ్రామిక శక్తి … కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

హైద‌రాబాద్‌ : భారతదేశంలో శ్రామిక శక్తి రాబోయే రోజుల్లో ప్రపంచ డిమాండ్ ను తీరుస్తుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన వికాస్ భారత్ పిలుపుతో 2047 నాటికి మన దేశాన్ని స్కిల్ డెవలప్ మెంట్ లో మరింత వృద్ధి సాధించే దిశగా దూసుకెళ్తున్నాయి. అందులో భాగంగా.. 15 ప్రసిద్ధ సంస్థలు, పరిశ్రమ దిగ్గజాలు, ప్రముఖ విద్యాసంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి ఎంఎస్డీఈ, ఎన్ఎస్ డీసీ. దీని ద్వారా రాబోయే రోజుల్లో స్కిల్ డెవలప్ మెంట్ కోసం అమృత్ పీఠిని ఏర్పాటు చేస్తాయి. ఇందులో భాగంగా ఫ్లిప్ కార్డ్, టీమ్ లీజ్, ఇన్ఫోసిస్, ఐఐటీ గౌహతి అండ్ లాజిక్ నాట్స్, టైమ్స్ ప్రో, బీసీజీ, గూగుల్, అప్ గ్రాడ్, అన్ స్టాప్, మైక్రోసాఫ్ట్, ఎం3ఎం ఫౌండేషన్, రిలయన్స్ ఫౌండేషన్, యస్ ఫౌండేషన్ యూపీఎస్, టైమ్ లీజ్ ఎడ్ టెక్ లాంటి దిగ్గజాలతో భాగస్వామ్యాలు ప్రకటించబడ్డాయి.

ఈ అద్బుతమైన కార్యక్రమంలో కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్య, అతుల్ కుమార్ తివారీ, కార్యదర్శి, ఎంఎస్ డీఈ, డా.నిర్మల్‌జీత్ సింగ్ కల్సి, చైర్‌పర్సన్, ఎన్ సీవీఈటీ, త్రిషల్జిత్ సేథి, డైరెక్టర్ జనరల్ (శిక్షణ), డీజీటీ ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ డీసీ సీఈఓ, ఎన్ఎస్ డీసీ ఇంటర్నేషనల్ ఎండీ వేద్ మణి తివారీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ… భారతదేశ యువశక్తికి నైపుణ్యం, సాధికారత కోసం అనేక కార్యక్రమాలు, పరిశ్రమ భాగస్వామ్యాలను ప్రారంభించడం తమకు సంతోషంగా ఉందన్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫ్లిప్‌కార్ట్, టీమ్‌లీజ్, అప్‌గ్రాడ్, రిలయన్స్ ఫౌండేషన్ వంటి మరిన్ని సంస్థలతో ఇవాళ ఏర్పడిన ఈ భాగస్వామ్యాలు స్కిల్ ఇండియా మిషన్‌ను మరింత ముందుకు నడిపిస్తాయన్నారు. అంతేకాకుండా ప్రపంచ అవకాశాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న సమర్ధవంతమైన, ఉత్పాదక, సమర్థవంతమైన వర్క్‌ఫోర్స్‌ ను నిర్మిస్తాయన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement