Saturday, December 7, 2024

HYD: ప్రఖ్యాత మహావీర్‌ గ్రూప్‌ లో భాగమైన మహావీర్‌ స్కోడా..

హైదరాబాద్‌ : దసరా ఉత్సవాలకు అద్భుతమైన కిక్‌ ఆఫ్‌ లో ప్రఖ్యాత మహావీర్‌ గ్రూప్‌లో భాగమైన మహావీర్‌ స్కోడా తమ గర్వించదగిన యజమానులకు 101 సరికొత్త స్కోడా కార్లను పంపిణీ చేయడం ద్వారా ఆనందాన్ని పంచుకొని వేడుకలు జరుపుకుంది. ఈ కార్యక్రమానికి స్కోడా ఆటో ఇండియా మార్కెటింగ్‌ హెడ్‌ రాహుల్‌ పన్సారే, మహావీర్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ యశ్వంత్‌ జబఖ్‌, మహావీర్‌ ఆటో మేనేజింగ్‌ డైరెక్టర్‌ పార్శ్వ కుమార్‌ ఝబఖ్‌, జీత్‌ ఝబఖ్‌ వచ్చినందున ఈ మహాత్తర సందర్భం మరింత ప్రత్యేకమైంది.

డైరెక్టర్‌ మహావీర్‌ ఆటో చిరునవ్వులు చిందిస్తూ ఉత్సాహం నింపుతూ కొత్త సగర్వ యజమానులకు ప్రతినిధులు తాళాలు అందజేశారు. శ్రేష్టత, కస్టమర్‌ సంతృప్తికి నిబద్దతకు పేరుగాంచిన మహావీర్‌ స్కోడా డీలర్‌షిప్‌ హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ విశేషమైన సంఘటన అధిక నాణ్యత వాహనాలను, అసాధారణమైన సేవలను అందించడంలో స్కోడా నిబద్ధతను నొక్కి చెబుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement