Thursday, May 2, 2024

Hyderabad: కూక‌ట్ పల్లిలో లారీ బోల్తా

హైద‌రాబాద్ లోని కూకట్పల్లి మెయిన్ రోడ్డుపై గురువారం రాత్రి ఓ పాల లారీ బోల్తా పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కూకట్పల్లి నుంచి కేపీహెచ్బీకి వస్తున్న ఓ పాల లారీ.. టైర్ పేలడంతో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న పాల ప్యాకెట్లు రోడ్డు మీద పడగా.. కొంత సమయం పాటు అక్కడ ట్రాఫిక్ కు అంతరాయం ఏర్ప‌డింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీని రోడ్డు మీద నుంచి తొలగించి.. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement