Thursday, April 25, 2024

TTD: సామాన్య భక్తులకు గుడ్ న్యూస్.. విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనంలో ప్రాధాన్యత ఇచ్చేలా శని, అది వారాల్లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. సర్వదర్శనం భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు శుక్ర, శని, ఆదివారాలలో సిఫార్సు లేఖలపై కేటాయించే విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. విఐపిల కోసం కేటాయించిన సమయాన్నీ కూడా సామాన్య భక్తులకు కేటాయించేలా నిర్ణయం తీసుకున్నారు. శుక్ర,శని, ఆదివారాలలో సర్వదర్శనం భక్తుల సౌకర్యార్దం అదనంగా దర్శన టోకన్లు జారీ చేసేందుకు నిర్ణయించారు. ఇప్పటికే రోజుకు సర్వదర్శనం భక్తులకు 30 వేల టోకన్లు జారీ చేస్తోంది. టీటీడీ తాజా నిర్ణయంతో సర్వదర్శన భక్తులకు రోజుకు అదనంగా మరో రెండు గంటల దర్శన సమయం పెరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement