Thursday, April 25, 2024

స్థానిక సంస్థ‌ల‌ను మ‌రింత బ‌లోపేతం చేస్తాం – క‌విత‌..

హైదరాబాద్‌ : స్థానిక సంస్థల బలోపేతానికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. స్థానిక సంస్థలకు బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించినందుకు గాను రాష్ట్ర పంచాయితీ రాజ్ ఛాంబర్, జెడ్సీటీసీలు, ఎంపీటీసీల సంఘం ప్రతినిధులు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవితను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం 202-21 బడ్జెట్‌లో జిల్లా పరిషత్ లకు రూ. 252 కోట్లు, మండల పరిషత్ లకు రూ.248 కోట్లు కేటాయించిందన్నారు. పరిపాలనా వ్యవస్థలో స్థానిక సంస్థల ప్రతినిధుల పాత్ర కీలకమన్న ఎమ్మెల్సీ కవిత, గ్రామీణాభివృద్ధిలో వారి పాత్రను మరింత క్రియాశీలం చేస్తామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ పంచాయితీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు చింపుల సత్యనారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బాదేపల్లి సిద్ధార్థ,ఉపాధ్యక్షులు అశోక్ రావు, రాష్ట్ర కార్యదర్శి మందిపల్ వెంకట్ , రాష్ట్ర ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు చింపుల శైలజ సత్యనారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పేరుమల్ల గుట్టయ్య, ఉపాధ్యక్షులు కావలి శ్రీశైలం, జడ్పీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బెల్లం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి భరత్ ప్రసాద్ ,గౌరవ అధ్యక్షుడు నాగేష్ వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement