Thursday, April 25, 2024

మ‌రో 50 వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తాం: హ‌రీశ్ రావు

తెలంగాణ‌లో ఉద్యోగ ఖాళీల భ‌ర్తీపై మంత్రి హ‌రీశ్ రావు మ‌రోసారి స్పందించారు. తెలంగాణ రాష్ట్రం కల సాకారం అయినప్పటి నుంచి 1,30,000 ఉద్యోగాలు టీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేసింద‌ని చెప్పారు. రానున్న రోజుల్లో మరో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లు తెలిపారు మంత్రి హరీష్ రావు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో మోడల్ జిల్లా గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. మోడల్ జిల్లా గ్రంథాలయం జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలకు స‌న్న‌ద్ధ‌మ‌య్యే విద్యార్థుల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తెలిపారు. డిజిటల్ లైబ్రరీలో మొత్తం 13 కంప్యూటర్లు కూడా ఉన్నాయని, వాటిని విద్యార్థులు వాడుకునేందుకు వీలుగా ఉచిత ఇంటర్నెట్ సౌక‌ర్యం కూడా క‌ల్పించామ‌ని చెప్పారు. విద్యార్థులు తమకు కావాల్సిన పుస్తకాలు ఏంటో చెబితే వాటిని కచ్చితంగా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement