Sunday, May 19, 2024

అయ్యప్ప స్వామి దేవాలయంలో ఘనంగా రెండో రోజు వార్షికోత్సవ వేడుకలు

కర్మన్ ఘాట్ – శ్రీ హరి హర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయం దశమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రెండవ రోజు గణపతి శ్రీ లక్ష్మీ గణపతి యాగం, మహా సుదర్శన యాగం నిర్వహించారు . శాంతి మంత్ర పఠనం , గురు వందన సమర్పణ, దీక్ష హోమములు మూలమంత్రం హోమములు జగద్గురు శంకరాచార్య హంపి విరుపాక్ష విద్యారణ్య భారతి మహాస్వామి సమక్షంలో నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాదాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో చైర్మన్ వంగా మధుసూదన్ రెడ్డి దంపతులు, సందీప్ రెడ్డి , కొక్కొండ సూర్య ప్రకాష్ గుప్తా, కేశవ రెడ్డి, హనుమాన్ సాగర్, పానుగంటి గోపాల్ దంపతులు హోమంలో పాల్గొనగా ఈ కార్యక్రమంలో మిరియాల అంజయ్య గుప్తా, మణిపాల్ రెడ్డి, రమేష్ గౌడ్,వేదేశ్వర్ రెడ్డి ,భిక్షపతి గౌడ్, వీరారెడ్డి, శివరాం రెడ్డి తో పాటు భక్తులు అధిక పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement