Saturday, May 11, 2024

మహిళలు కరాటేనే నేర్చుకోవాలి: చీరసుచిత్ర

సికింద్రాబాద్‌ : ఆత్మరక్షణ కోసం ఉపయోగపడే కరాటేను మహిళలు తప్పనిసరిగా నేర్చుకొవాలని రాంగోపాల్‌పేట డివిజన్‌ కార్పొరేటర్‌ చీరసుచిత్ర అన్నారు.డివిజన్‌లోని నల్లగుట్ట ప్రభుత్వ పాఠశాలలో జరిగిన కరాటే ప్రదర్శనను కార్పొరేటర్‌ చీరసుచిత్ర తిలకించారు. వారి ప్రతిభాను చూసి ప్రత్యేకంగా అభినందించి సర్టిపికేట్లను ప్రదానం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కరాటే ఆత్మరక్షణతోపాటు మనిషి ఆరోగ్యపరంగా ఎంతో బాగుంటారన్నారు. నగరంలో ఎన్నో శిక్షణ కేంద్రాలు ఉన్నాయని, ప్రతిరోజు వేలాది మంది ప్రత్యేకంగా శిక్షణ పొందుతున్నారన్నారు. కరాటేలో కూడ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినవారు ఎంతోమంది ఉన్నారని చెప్పారు. మహిళలు కరాటేను నేర్చుకుంటే బాగుంటుందని, చిన్నతనం నుండే ఈ శిక్షణ నెర్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. ఇక్కడ నిర్వహించిన కరాటే ప్రదర్శన నిజంగా అబ్బురపరిచిందన్నారు. ఈ కార్యక్రమంలో మాస్టర్‌ అమర్‌, కల్యాణ్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement