Wednesday, May 1, 2024

HYD | కంటోన్మెంట్‌లో ముంపు నివార‌ణ‌కు త‌క్ష‌ణ చ‌ర్య‌లు.. 30 కోట్ల‌తో ప‌నులు

హైద‌రాబాద్‌లోని కంటోన్మెంట్ ప‌రిధిలో ప‌లు ప్రాంతాలు వానాకాలంలో ముంపున‌కు గుర‌వుతున్నాయి. ఏటా భారీ వ‌ర్షాల‌ప్పుడు ముంపున‌కు గుర‌వుతున్న ప్రాంతాల‌లో వ‌ర‌ద నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని మ‌ల్కాజిగిరి పార్ల‌మెంట్ ఇన్‌చార్జి, బీఆర్ ఎస్ నేత మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌కు ఇవ్వాల (బుధ‌వారం) విన్న‌వించారు. కూక‌ట్‌ప‌ల్లి ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావుతో క‌లిసి ఆయ‌న మంత్రిని క‌లిశారు. ఈ విష‌య‌మ్మీద‌ మంత్రి కేటీఆర్ త‌క్ష‌ణ‌మే స్పందించారు.

ముంపు ప్రాంతాల్లో ప‌నులు చేప‌ట్టేందుకు స్ట్రాట‌జిక్ నాలా డెవ‌ల‌ప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ ఎన్‌డీపీ) కింద త‌క్ష‌ణ‌మే 30 కోట్ల రూపాయ‌ల‌ను మంజూరు చేశారు. ఈ ఫండ్స్‌తో యుద్ధ ప్రాతిప‌దిక‌న ప‌నులు చేప‌ట్టి ముంపు ప్రాంతాల్లో ఇబ్బందులు లేకుండా చూడాల‌ని మంత్రి కేటీఆర్ సూచించారు. వీరితోపాటు కంటోన్మెంట్ మాజీ మెంబ‌ర్ నేత జెఎంఆర్‌, బీఆర్ ఎస్ నేత‌ పాండు యాద‌వ్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement