Sunday, May 5, 2024

ఆర్కిడ్స్ ది ఇంటర్నేషనల్ స్కూల్ లో హార్టికల్చర్ ఫెసిలిటీ

ఆర్కిడ్స్ ది ఇంటర్నేషనల్ స్కూల్ తమ బాచుపల్లి శాఖలో అతిపెద్ద పాలీహౌస్ సదుపాయం, ఒక కొత్త ఆడిటోరియంను ఆవిష్కరించారు. హార్టికల్చర్ పాఠ్య ప్రణాళికకు లిటిల్ గ్రీన్ ఫింగర్స్ అని పేరు పెట్టారు. ఇది గ్రేడ్ 1 నుండి 10 వరకు విద్యార్థులకు బోధించబడుతుంది. ముఖ్య అతిథి క్యాంపస్ టూర్ చేసి విద్యార్థులతో ముచ్చటిస్తూ.. ఆర్కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లోని విద్యార్థులు అత్యంత ప్రతిభావంతులు, హార్టికల్చర్, రోబోటిక్స్ వంటి విశిష్టమైన అంశాలను పరిశీలించడానికి, అన్వేషించడానికి, నేర్చుకునేందుకు మంచి అవకాశం ఇక్కడ లభిస్తోంది. విద్యార్థి సమగ్ర అభివృద్ధి, దృఢమైన వ్యక్తిత్వాన్ని నిర్మించడంలో ఇది సహాయపడుతుంది. నగరంలో ఇంత పెద్ద ఎత్తున పాలీహౌస్‌ను ప్రారంభించిన మొదటి పాఠశాల ఇదే. ఈ విశిష్ట ప్రయత్నానికి తన సహకారాన్ని అందించడం తనకు సంతోషంగా ఉందన్నారు.

బాచుపల్లి ఆర్కిడ్స్ ది ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ డా.ఎన్.అరుణరావు మాట్లాడుతూ… విద్యార్థుల్లో పోషణ, సంరక్షణ భావాన్ని పెంపొందించడం తాము లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆ దిశలో ఒక ముందడుగే హార్టికల్చర్ పాఠ్య ప్రణాళికలన్నారు. మొక్కల పెరుగుదలలో ఉన్న సైన్స్ నేర్చుకోవడమే కాకుండా, పిల్లలు ఈ మొక్కలను కోయడం, వాటిని తమ వర్ధమాన రైతు మార్కెట్ ద్వారా మార్కెట్‌లో విక్రయించడం కూడా నేర్చుకుంటారన్నారు. ఇది ఆర్థిక అక్షరాస్యత పాఠ్యాంశాలతో పాటు హార్టికల్చర్ నేర్చుకోవడం వల్ల వారికి రెట్టింపు ప్రయోజనాన్ని అందిస్తుందన్నారు. తమ హార్టికల్చర్ ఇనిషియేటివ్ కు పిల్లలు, తల్లిదండ్రుల నుండి అపారమైన స్పందన లభిస్తోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement