Friday, April 26, 2024

వైర్‌ మెన్‌, సూపర్‌వైజర్‌ పరీక్షలకు ఉచిత శిక్షణ.. నేటి నుంచి 30 వరకు తరగతులు

హైదరాబాద్‌, ప్రభన్యూస్‌ : వైర్‌మెన్‌, సూపర్‌ వైజర్‌ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈరోజు నుంచి 30 వరకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్‌ ఎలక్ట్రికల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి నేమాల బెనర్జీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెలలో జరగబోయే పరీక్షకు హాజరు కాబోయే అభ్యర్థులు శిక్షణ కోసం ముందుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఉచిత శిక్షణా కార్యక్రమం మింట్‌ కంఫౌండ్‌లోని డాక్టర్‌ అంబేద్కర్‌ స్ఫూర్తి భవన్‌లో నిర్వహించబడతాయని తెలిపారు. శిక్షణకు వచ్చే వారు 9989892717, 9390999920 నెంబర్లకు ఫోన్‌ చేయాలని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement