Sunday, May 9, 2021

కంటైనర్ తాకిన హైటెన్ష‌న్ విద్యుత్ వైర్లు . డ్రైవ‌ర్, క్లీన‌ర్ స‌జీవ ద‌హ‌నం.

హైదరాబాద్‌లో నేటి ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఉప్పల్ నుంచి రామంతాపూర్ వెళ్లే దారిలో మోడ్రన్ ఫుడ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద కిందకు వేలాడుతున్న విద్యుత్ వైర్లు కంటైనర్‌కు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కంటైన‌ర్ క్ష‌ణాల్లో కాలిపోయింది.. అందులో ఉన్న డ్రైవర్, క్లీనర్ సజీవ దహనం అయ్యారు. అలాగే కంటైన‌ర్ లో ఉన్న కారులు బూడిద‌య్యాయి.. సమాచారం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్ధలానికి వెళ్లి మంటలను ఆర్పారు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News