Sunday, May 9, 2021

క‌రోనా బాధితుల‌కు అండ‌గా ఎమ్మెల్యే రేగా కాంతారావు…

పిన‌పాక‌ : కరోనా విపత్కర వేళ.. ఏజెన్సీ నియోజకవర్గమైన పినపాకలో పేద కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అండగా నిలుస్తున్నారు. తన సొంత ఖర్చులతో వారి ఆదేశాల మేరకే బియ్యం, ఆలుగడ్డలు, ఉల్లిపాయలు, మంచినూనె, పలు రకాల నిత్యావసర సరుకులు అందజేస్తున్నారు. ఈనెల 2వ తేదీ నుండి నియోజక వర్గంలోని అన్ని మండలాల్లో వేలాదిమంది పేదలకు.. టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామాల వారీగా పంపిణీచేస్తు న్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానవతా స్ఫూర్తితో.. ఆపదకా లంలో పేద గిరిజన, దళితులకు ఆపన్నహస్తం అందిస్తున్నా నని, సాయంగా ఉంటున్నానని రేగా కాంతారావు అన్నారు. గత ఏడాది కూడా కరోనా సమమంలో సీఎం పిలుపుమేరకు.. అప్పులుచేసి మరీ పేద కుటుంబాల ఆకలితీర్చిన రేగా కాంతారావు, ఇపుడు లాక్‌డౌన్‌ లేకున్నా.. కరోనాతో కుదేలవుతున్న కుటుంబాలకు తోడుగా నిలుస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News