Saturday, April 27, 2024

ఆగస్టు 11న సైబర్‌ కాంగ్రెస్‌ ఫినాలే కార్యక్రమం.. ఉత్త‌మ విద్యార్థుల‌కు బ‌హుమ‌తుల ప్ర‌దానం

వికారాబాద్‌, (ప్రభ న్యూస్‌): ఆగస్టు 11న వికారాబాద్‌ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నర్సింగ్‌ గౌలికర్‌ ఫంక్షన్‌ హాల్‌లో సైబర్‌ కాంగ్రెస్‌ గ్రాండ్‌ ఫినాలే కార్యక్రమం ఉంటుంద‌ని జిల్లా ఎస్‌పి కోటి రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం గత 10 నెలల నుండి ఆన్‌ లైన్‌లో ఉమెన్‌ సేఫ్టి వింగ్‌, షీటీమ్‌, ఆధ్వర్యం లో 50 పాఠశాలల నుండి 50 మంది ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో 100 మంది విధ్యార్థులకు శిక్షణ ఇవ్వటం జరిగిందని తెలిపారు.

27 జూలై నుండి 31 జూలై వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గ్రాండ్‌ ఫినాలే రోజున బహుమతులు అందజేయటం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర మహిళా భద్రతా విభాగం మరియు యంగిస్తాన్‌ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ గ్రాండ్‌ ఫినాలే కార్యక్రమం నిర్వహించటం జరుగుతుందని తెలిపారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement