Wednesday, March 27, 2024

17న అథ్లెటిక్స్‌ జిల్లా స్థాయి పోటీలు .. తాండూరులో నిర్వ‌హ‌ణ‌

తాండూరు రూరల్‌, ఆగస్టు (ప్రభన్యూస్‌) : తాండూరులో జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి సంజీవ్‌ చవాన్‌ తెలిపారు. ఈనెల 17న తాండూరులోని పాత శాలివాహన కళాశాల మైదానంలో అండర్‌ 14, 16, 18, 20 విభాగాలలో పోటీలు జరుగుతాయని చెప్పారు. బాలికలు, బాలురు, పురుషులు, మహిళల విభాగంలో పోటీలు జరుగుతాయన్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈనెల 24, 25వ తేదిలలో మెదక్‌ జిల్లాలో జరిగే రాష్ట్రాస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సెల్‌: 9705329646, 9392133237లకు సంప్రదించాలని సూచించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement